Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 27 Jan 2022 01:58:36 IST

మన్యం వేరు.. వీరుడు వేరా!?.. 2 జిల్లాలకు 2 పేర్లు

twitter-iconwatsapp-iconfb-icon
మన్యం వేరు.. వీరుడు వేరా!?.. 2 జిల్లాలకు 2 పేర్లు

  • అన్ని జిల్లాల్లోనూ ఇదే తీరు..
  • వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు గందరగోళంగా తయారయ్యాయి. భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటుచేసి, దానికి అల్లూరి సీతారామరాజు పేరు పె ట్టాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరాన్ని కలిపి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించి దానికి అల్లూరి పేరు పెట్టనున్నట్టు తెలిపింది. అలాగే, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాలను కలిపి ‘మన్యం’ జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే విశాఖ ఏజెన్సీనే ‘మన్యం’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతాలైన పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాంల ‘మన్యం’ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


తూర్పుగోదావరిలో సౌలభ్యం ఏదీ?

కొత్త జిల్లాల ప్రతిపాదనలపై తూర్పుగోదావరి జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోనసీమ జిల్లాలో.. రామచంద్రపురం, మండపేటలను చేర్చారు. ఇవి కోనసీమేతర ప్రాంతాలు. ఇక్కడి వారికి కాకినాడ జిల్లా దగ్గరగా ఉంటుంది. రంచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల మండలాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపుతూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 250 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాడేరు వెళ్లడం అసాధ్యమని ఆదివాసీ సంఘాలు అభ్యంతరా లు వ్యక్తం చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో చేరనున్న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి.. విజయవాడకు చేరువలో ఉంటుంది. కానీ నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల దాదాపు 60 కి లోమీటర్లు ప్రయాణ భారం పెరగుతుంది. అలాగే, కృష్ణా జిల్లాలోనూ గందరగోళం ఏర్పడింది. ఇప్పటివరకు ఇదే జిల్లాలో ఉన్న నూజివీడు, కైకలూరులకు జిల్లావాసులతో అనుబంఽధం తెగిపోనుంది. ఈ రెండూ ఏలూరు జిల్లాకు వెళ్తాయని ముసాయిదాలో పేర్కొన్నారు.


మరో వి చిత్రం ఏమిటంటే.. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎ న్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఇక గుంటూరు జిల్లాను ప్రధానంగా పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ప్రతిపాదించడంపై అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవానికి పల్నాడు అంటే గురజాల, మాచర్ల అని.. ఆ రెండు చోట్లలో ఎ క్కడైనా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ, వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  ప్రకాశం జిల్లా విభజన హేతుబద్ధంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మూడు ముక్క లు కానుంది. చంద్రగిరిని తిరుపతి జిల్లా పరిధిలో చేర్చారు. పుంగనూరును చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మున్సిపల్‌ పట్టణంగా యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిని దానికంటే ఎంతో చిన్నదైన నాయుడుపేట డివిజన్‌లో చేర్చడం గమనార్హం. రాజంపేట (అన్నమయ్య) జిల్లాకు మదనపల్లెను కేంద్రం గా ప్రకటించాలని ఉద్యమం నడుస్తోంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పేరుపెట్టి కడప జిల్లా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మదనపల్లె వాసులకు ఆ గ్రహం తెప్పిస్తోంది. అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలు రెండు జిల్లాలవుతున్నాయి. హిందూపు రాన్ని సత్యసాయి జిల్లాగా మార్చారు. రాప్తాడు అసెంబ్లీని అనంతపురం జిల్లాలో చేర్చారు. రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలో చేర్చడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు  భావిస్తున్నా రు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి మంచి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో వారి బలం తగ్గించే ఉద్దేశంతోనే స్థానిక అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు రాప్తాడును అనంతపురం జిల్లా లో చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.