విద్యార్థులకు బూట్ల పంపిణీకి చర్యలు

ABN , First Publish Date - 2020-06-06T09:49:13+05:30 IST

‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం కింద 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీకి వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాడ్రేవు

విద్యార్థులకు బూట్ల పంపిణీకి చర్యలు

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం కింద 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీకి వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 8-9 తేదీలలో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వారి కొలతలు సేకరించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదన్నారు. 

Updated Date - 2020-06-06T09:49:13+05:30 IST