హైదరాబాద్: బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు, పప్పు నూనె ధరలు అధికంగా పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందన్నారు. బీజేపీ పాలనలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అందుకే దేశవ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలు మద్దతుగా నిలవాలని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.