దళితబంధు లబ్దిదారుల ఎంపికలో ఇబ్బందులు: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ABN , First Publish Date - 2022-02-04T00:29:50+05:30 IST

దళితబంధు లబ్దిదారుల ఎంపికలో ఇబ్బందులు ఉన్నాయని మంథని

దళితబంధు లబ్దిదారుల ఎంపికలో ఇబ్బందులు: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

హన్మకొండ: దళితబంధు లబ్దిదారుల ఎంపికలో ఇబ్బందులు ఉన్నాయని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కలెక్టరేట్‌లో దళిత బంధు పథకంపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై బాధ్యత పెడితే ఒత్తిడి పెరుగుతుందన్నారు. హుజురాబాద్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.లబ్దిదారులను గుర్తించేందుకు కలెక్టర్లకు తగిన సమయం ఇవ్వాలన్నారు. శాస్త్రీయ విధానాలు రూపొందించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసే విధానం తీసుకురావాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-02-04T00:29:50+05:30 IST