Abn logo
Apr 16 2021 @ 20:45PM

200 ఐపీఎల్ మ్యాచ్‌లతో ధోనీ అరుదైన రికార్డు

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2007లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఐపీఎల్ ఆడుతున్న చెన్నై తరపున 11 సార్లు చెన్నై ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌తో 12వ సారి టోర్నీలో చెన్నై కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఇప్పటివరకు 3 సార్లు చెన్నై ఫ్రాంచైజీని ఛాంపియన్‌గా ట్రోఫీ అందించాడు. బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి మొత్తం 10సార్లు సెమీస్ చేర్చాడు. ఫైనల్స్‌కు ఎనిమిది సార్లు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే 59.83 శాతంతో అత్యధిక విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్న జట్టుగా చెన్నైని నిలిపాడు.

Advertisement
Advertisement
Advertisement