ధోనీ.. ఫీజు తీసుకోడు

ABN , First Publish Date - 2021-10-13T06:53:49+05:30 IST

వచ్చేనెలలో జరిగే టీ20 ప్రపంచక్‌పలో టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించనున్నందుకు మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాంటి ఫీజూ తీసుకోవడం లేదని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ వెల్లడించాడు...

ధోనీ.. ఫీజు తీసుకోడు

మెంటార్‌గా సేవలపై గంగూలీ

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే టీ20 ప్రపంచక్‌పలో టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించనున్నందుకు మహేంద్రసింగ్‌ ధోనీ ఎలాంటి ఫీజూ తీసుకోవడం లేదని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ వెల్లడించాడు. పొట్టి కప్పుకోసం గతనెలలో ఎంపిక చేసిన భారత జట్టులో 40 ఏళ్ల ధోనీని మెంటార్‌గా బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘భారత జట్టు మెంటార్‌గా ఉంటున్నందుకు ధోనీ ఫీజు వసూలు చేయడం లేదు’ అని దాదా తెలిపాడు. తన సారథ్యంలో టీమిండియాను రెండుసార్లు (2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌) ప్రపంచ విజేతగా నిలిపిన ధోనీ.. జట్టుకు సేవలందించడాన్ని బాధ్యతగా భావిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశాడు. అందుకే తాను ఎలాంటి ఫీజూ తీసుకోనని మెంటార్‌గా ఎంపిక చేసినరోజే ధోనీ తమకు స్పష్టం చేశాడని జై షా తెలిపాడు.  

Updated Date - 2021-10-13T06:53:49+05:30 IST