ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ధర్నా

ABN , First Publish Date - 2020-03-04T07:51:00+05:30 IST

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2017 తరువాత ఉపాధ్యాయుల బదిలీలు జరుగలేదు. ఈ విషయంపై ఆందోళనలు...

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ధర్నా

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2017 తరువాత ఉపాధ్యాయుల బదిలీలు జరుగలేదు. ఈ విషయంపై ఆందోళనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరో వైపు ప్రభుత్వం బదిలీలు, డిప్యూటేషన్లకు తెరతీసింది. మూడు డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్‌సీ అమలు చేయడం లేదు. అమ్మఒడి పథకం ప్రయివేటు పాఠశాలలకు వర్తింపజేయటం ప్రభుత్వ పాఠశాలలను బలహీన పరుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ముంచుకొస్తున్నది. మాతృభాషా మాధ్యమాన్ని ఎత్తివేస్తే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిడం వల్ల ప్రైవేటు కాలేజీలకు విద్యార్థులకు అందించటానికే ఉపయోగపడుతుంది. అందుకని, మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించాలి. కామన్‌ స్కూల్‌ విధానం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. వివిధ రకాల యాజమాన్యాలు, సంస్థలు, సొసైటీల స్కూళ్లన్నింటినీ ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకురావాలి. సీపీఎస్‌ను రద్దుపైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రభుత్వం ఆశాభంగమే మిగిల్చింది. ఏకీకృత సర్వీసు రూల్సు సమస్య రగులుతూనే ఉంది. మండల విద్యాశాఖాధికారు, డీవైఈఓ పోస్టులు, డైట్‌ లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌, ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదు. సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సిగ్‌ నియామకాల వల్లనే రెగ్యులర్‌ పోస్టులు భర్తీ కావడం లేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా విద్యా, ఉపాధ్యాయ రంగం సర్వత్రా సమస్యలతో కునారిల్లిపోతున్నది. వీటిపై దశలవారీ పోరాటం చేయాలని ఏపీటీఎఫ్‌ నిర్ణయించింది. మొదటి దశ ఆందోళనగా జనవరి 29వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాం. అయినా సమస్యల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ప్రభుత్వం నుంచీ స్పందనే లేనందున రెండో దశ ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని రేపు, 5వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాను నిర్వహిస్తున్నాం. 

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

Updated Date - 2020-03-04T07:51:00+05:30 IST