Abn logo
Oct 25 2020 @ 00:18AM

ధర్మవిజయ దుర్గేశ్వరీ!!

శ్రీక‘రాశ్వయుజ’–విజయశ్రీ శుభోద

యాన–‘ఇంద్రకీల’ శిఖరాగ్రాన ‘మహిష–

రాక్షసుని–వధించి–జగాల రక్షచేసి

అవని ‘కళ్యాణ కనకదుర్గాంబ’!! వెలసె!!


శ్రీశరన్నవాలంకారి! శ్రీ భవాని!

శూల–చక్ర–ఖడ్గ–యమపాశాల–దాల్చి

నట్టి–‘చంద్రకళాధరి’! శివానందలహరి!

కరుణవర్షిణి! కళ్యాణ కనకదుర్గ!!


శ్రీ లలిత–శ్రీ మహాలక్ష్మి–బాల–శ్రీస

రస్వతీదేవి–అన్నపూర్ణమ్మ–వేద‍

జనని ‘గాయత్రి’–మహిషరాక్షసదమని–ప్ర 

సన్న ‘రాజేశ్వరీమాత’!!–శరణు!శరణు!!


‘శ్రీమహాగౌరి–కూష్మాండ–సిద్ధిదాత్రి

చంద్రఘంట–కాత్యాయని–శైలపుత్రి

బ్రహ్మచారిణి–శ్రీకాళరాత్రి–స్కంద

మాత–‘నవదుర్గ’ పాదపద్మాలు–శరణు!!


సర్వమంగళదాత్రి! శ్రీశైల మల్లి

కార్జునేశ్వరీ! ‘భ్రమరాంబ’ అరుణ

రాక్షసదమని! శ్రీచక్రరాజ్ఞి! దివ్య‍

శక్తి పీఠేశ్వరీ–మాత! శరణు–శరణు!!


భారతావని–భాగ్యాల పరిఢవిల్ల,

‘తెలుగు లోగిళ్ళు’ సిరులతో తేజరిల్ల,

‘‘ధర్మవిజయ దుర్గేశ్వరీ!!’’ ధరణిలోన–

శాంతి శుభములు కురిపించు చల్లగాను!!

కళ్యాణశ్రీ

Advertisement
Advertisement
Advertisement