ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చు: డీహెచ్‌ శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-12-02T23:07:09+05:30 IST

ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు.

ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చు: డీహెచ్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌: ఒమైక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావచ్చని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన మహిళను టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితురాలి శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సీకి పంపామని పేర్కొన్నారు. ఒమైక్రాన్ వేరియంట్‌ 25 దేశాలకు వ్యాపించిందని తెలిపారు. ఏ క్షణంలోనైనా మన దేశంలోకి ఒమైక్రాన్ ప్రవేశించే అవకాశం ఉందన్నారు. టీకాల వల్లే ఆస్పత్రుల్లో చేరే ముప్పు తప్పించుకోవచ్చని ఆయన సూచించారు. వ్యాక్సిన్‌ ద్వారా ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. డెల్టా కంటే ఒమైక్రాన్ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. టీకా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. కొవిడ్‌ నిబంధన ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-02T23:07:09+05:30 IST