విజయవాడ : కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందని ట్విటర్ వేదికగా దేవినేని ఉమ పేర్కొన్నారు. గోవాను తలదన్నే రీతిలో ‘క్యాసినో’ ఏర్పాటు చేసిన మండపం ఎవరిదని ప్రశ్నించారు. ధాన్యానికి మద్దతు ధర లేక, అమ్మిన వాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయా దందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై.. చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.