Abn logo
Feb 22 2020 @ 04:28AM

‘వెలిగొండ’పై సజ్జల అబద్ధాలు: ఉమ ఆగ్రహం

మంగళగిరి, ఫిబ్రవరి 21: ముఖ్యమంత్రి జగన్‌ వెలిగొండ పర్యటన చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని.. వెలిగొండ పనుల్లో అవినీతి జరిగితే ఆయన ఏం గడ్డి పీకుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో బతికేస్తున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. వెలిగొండ ఒకటో టన్నెల్‌ పనులు 90.96 శాతం పూర్తయ్యాయని, 17.78 కిలోమీటర్ల వరకు టన్నెల్‌ బోరింగ్‌ పనులు పూర్తయ్యాయని, మొత్తం 18.798 మీటర్లలో 17.78 కిలోమీటర్ల వరకు పూర్తయినట్లు సీఎం చేసిన సమీక్షలో ప్రభుత్వమే అంగీకరించిందని పేర్కొన్నారు. జగన్‌ వ చ్చాకే వెలిగొండ టన్నెల్‌ పూర్తిచేసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం సాయం త్రం బెంగుళూరు వెళ్లి.. సోమవారం ఉదయాన్నే తిరిగొచ్చే ఆయన.. ఎవరి నుంచి ఎంతెంత వసూలు చేస్తున్నాడో డమ్మీ మంత్రులను అడిగితే తెలుస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గత ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌-1లో 4.4 కిలోమీటర్ల పనులను పూర్తి చేశామన్నారు. 

Advertisement
Advertisement
Advertisement