వాస్తవాలు తెలుసుకోకుండా బూతులా..? : దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-10-31T03:54:37+05:30 IST

పోలవరం ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా ఏపీలో

వాస్తవాలు తెలుసుకోకుండా బూతులా..? : దేవినేని ఉమా

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్న విషయం విదితమే. ఇవాళ కూడా నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ.. అధికార పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పోలవరం గురించి మంత్రులు వాస్తవాలు తెలుసుకోకుండా బూతులు మాట్లాడుతున్నారంటూ దేవినేని మండిపడ్డారు.


వాస్తవాలు తెలుసుకోకుండా బూతులా..!?

మంత్రులతో బూతులు మాట్లాడిస్తే ప్రాజెక్ట్ పూర్తికాదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. పోలవరం పనులు 71.02 శాతం జరిగాయని వైసీపీ ప్రభుత్వంలోని అధికారులే చెప్పారు. పోలవరం పూర్తి అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు కేంద్రం ఆమోదించింది. గతంలో ఆమోదించిన వ్యయంపై జగన్ ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారు?. జగన్‌ కేసుల భయంతోనే కేంద్రంపై పోరాటం చేయడంలేదు అని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-10-31T03:54:37+05:30 IST