అమరావతి: ఏపీలో మౌలికవసతుల కల్పన నిధులు పక్కదారి పడుతున్నాయిన మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పెండింగ్ బిల్లుల నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తారని చెప్పారు. డెడ్ లైన్ పెట్టినా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. మీ పద్ధతి బాగోలేదంటూ ప్రపంచబ్యాంక్ చివాట్లు పెట్టిందన్నారు. అంతర్జాతీయ స్థాయికి చేరిన ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.