అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు: కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-09-25T07:46:24+05:30 IST

భవిష్యత్తు నగరం కోసం చేపట్టే అభివృద్ధి పనులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఈ మేరకు సౌకర్యాలను అభివృద్ధి చేయాలని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు: కేటీఆర్‌

కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌ పనుల పరిశీలన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు నగరం కోసం చేపట్టే అభివృద్ధి పనులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఈ మేరకు సౌకర్యాలను అభివృద్ధి చేయాలని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోకాపేటలోని నియోపోలీస్‌ లేఅవుట్‌, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీల) నిర్మాణ పనులు పరిశీలించారు. ఎస్టీపీల నిర్మాణాల్లో వినియోగించే సాంకేతికతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ప్రమాణాలకు సరిపోయే విధంగా నియోపోలీసు లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రోడ్డు నెట్‌వర్క్‌లు, సైకిల్‌ ట్రాక్‌ కోసం కొన్ని మార్పులను మంత్రి సూచించారు. అంతకుముందు ఫతేనగర్‌లోని ఎస్టీపీల నిర్మాణ పనులు మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న అన్ని ఎస్టీపీలపైన వాటర్‌బోర్డు అధికారులతో సమీక్షించారు. కాగా, కోకాపేటలోని ఎన్‌సీసీ క్యాంప్‌సలో వాటర్‌బోర్డు సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్‌ వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 

Updated Date - 2022-09-25T07:46:24+05:30 IST