Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రయాణికుడి హల్‌చల్.. అత్యవసరంగా ల్యాండైన విమానం

కాలిఫోర్నియా: విమానంలో ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. దీంతో తోటి ప్రయాణికులంతా హడలిపోయారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో ఫైలెట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన అమెరికాలో తాజాగా చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ 162 మంది ప్రయాణికులతో లాస్ ఏజెంల్స్ నుంచి టెన్నెసీకి బయల్దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు విమానంలో హల్‌చల్ చేశాడు. ‘ఈ విమానాన్ని ఆపండి’ అని గట్టిగా అరుస్తూ కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు ప్రయాణికుడిని నిలువరించడం విమాన సిబ్బందికి కష్టంగా మారింది. దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫైలెట్‌లు విమానాన్ని అత్యవసరంగా న్యూ మెక్సికోలోని ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. సదరు ప్రయణికుడు అలా ప్రయత్నించడానికి గల కారణాన్ని పోలీసులు బయటకు వెల్లడించలేదు. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement