ఢిల్లీ దంచెన్‌..

ABN , First Publish Date - 2021-05-03T10:01:06+05:30 IST

తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళుతోంది. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్‌), పృృథ్వీ షా (22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) ఆరంభంలో చెలరేగగా..

ఢిల్లీ దంచెన్‌..

పంజాబ్‌పై ఘనవిజయం

ధవన్‌ హాఫ్‌ సెంచరీ

మయాంక్‌ ఇన్నింగ్స్‌ వృథా


అహ్మదాబాద్‌: తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళుతోంది. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్‌), పృృథ్వీ షా (22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) ఆరంభంలో చెలరేగగా.. చివర్లో హెట్‌మయెర్‌ (4 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 16 నాటౌట్‌) తడాఖా చూపాడు. దీంతో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది. అలాగే 12 పాయింట్లతో నెంబర్‌వన్‌కు చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌ (58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 నాటౌట్‌) అదరగొట్టాడు. రబాడకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మయాంక్‌ నిలిచాడు. 


శుభారంభం:

ఓ మాదిరి ఛేదనను ఢిల్లీ ఎప్పటిలాగే ధాటిగానే ఆరంభించింది. రెండో ఓవర్‌లోనే పృథ్వీ షా వరుసగా 6,4,4తో జోరు చూపించాడు. అలాగే ఆరో ఓవర్‌లోనూ అతడు 6,4.. ధవన్‌ 4తో జట్టు పవర్‌ప్లేలో 63 పరుగులు సాధించింది. కానీ హర్‌ప్రీత్‌ బ్రార్‌ తన మొదటి బంతికే షాను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత స్మిత్‌ (24), పంత్‌ (14) కాసేపే క్రీజులో ఉన్నా అటు ధవన్‌ మాత్రం బ్యాట్‌కు పనిచెప్పాడు. 14వ ఓవర్‌లో 6,4,4తో 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక 18 బంతుల్లో 19 పరుగులు కావాల్సి ఉండగా హెట్‌మయెర్‌ 18వ ఓవర్‌లో 6,6,4 బాది మ్యాచ్‌ను ముగించాడు.


మయాంక్‌ ఒక్కడే:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ తడబడుతూ సాగినా.. ఓపెనర్‌ మయాంక్‌ మాత్రం చివరి వరకు అండగా నిలిచాడు. ఆరంభంలో వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్‌ (12), గేల్‌ (13)లను రబాడ పెవిలియ న్‌కు చేర్చాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీయడం అతడికిదే తొలిసారి. ఆ తర్వాత ఐదు ఓవర్లపాటు మయాంక్‌, మలాన్‌ (26) జాగ్రత్తగా ఆడడంతో ఒక్క ఫోర్‌ మాత్రమే వచ్చింది. చివరికి 12వ ఓవర్‌లో మలాన్‌ 6,4తో 13 పరుగులు రాబట్టింది. కానీ 14వ ఓవర్‌లో అక్షర్‌ తొలుత మలాన్‌ను అవుట్‌ చేయగా, ఆ వెంటనే దీపక్‌ హుడా (1) రనౌట్‌ అయ్యాడు. అటు మయాంక్‌ మాత్రం ఇషాంత్‌ ఓవర్‌లో 4,6 బాది 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. వికెట్లు పడుతున్నా అతడు జోరు ఆపలేదు. చివరి ఓవర్‌ 3 బంతులను 4,6,4గా మలిచి 23 రన్స్‌ రాబట్టాడు. చివరకు మయాంక్‌ తన సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.


స్కోరు బోర్డు

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) స్మిత్‌ (బి) రబాడ 12; మయాంక్‌ (నాటౌట్‌) 99; గేల్‌ (బి) రబాడ 13; మలాన్‌ (బి) అక్షర్‌ 26; హూడా (రనౌట్‌) 1; షారుక్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) అవేశ్‌ 4; జోర్డాన్‌ (సి) లలిత్‌ (బి) రబాడ 2; బ్రార్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 166/6. వికెట్ల పతనం: 1-17, 2-35, 3-87, 4-88, 5-129, 6-143. బౌలింగ్‌: ఇషాంత్‌ 4-1-37-0; స్టొయినిస్‌ 1-0-6-0; రబాడ 4-0-36-3; అవేశ్‌ ఖాన్‌ 4-0-39-1; లలిత్‌ యాదవ్‌ 3-0-25-0; అక్షర్‌ పటేల్‌ 4-0-21-1.


ఢిల్లీ: పృథ్వీ షా (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 39; ధవన్‌ (నాటౌట్‌) 69; స్మిత్‌ (సి) మలాన్‌ (బి) మెరిడిత్‌ 24; పంత్‌ (సి) అగర్వాల్‌ (బి) జోర్డాన్‌ 14; హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17.4 ఓవర్లలో 167/3; వికెట్ల పతనం: 1-63, 2-111, 3-147, బౌలింగ్‌: మెరిడిత్‌ 3.4-0-35-1; షమి 3-0-37-0; రవి బిష్ణోయ్‌ 4-0-42-0; జోర్డా న్‌ 2-0-21-1; హర్‌ప్రీత్‌ 3-0-19-1; దీపక్‌ హుడా 2-0-11-0. 

Updated Date - 2021-05-03T10:01:06+05:30 IST