వరవరరావు విడుదలకు ఆలస్యం

ABN , First Publish Date - 2021-02-26T08:16:19+05:30 IST

విప్లవకవి వరవరరావు ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదలకు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ష్యూరిటీకి ఆస్తిధ్రువీకరణ పత్రం తప్పనిసరికావడంతో ఆయన బయటకు వచ్చేందుకు

వరవరరావు విడుదలకు ఆలస్యం

ఆస్తి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో జాప్యం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): విప్లవకవి వరవరరావు ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదలకు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ష్యూరిటీకి ఆస్తిధ్రువీకరణ పత్రం తప్పనిసరికావడంతో ఆయన బయటకు వచ్చేందుకు జాప్యం జరుగుతోంది. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన వరవరరావుకు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను సోమవారం మంజూరు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలిలోని మరొక కేసులోనూ నాగపూర్‌ హైకోర్టు ధర్మాసనం కూడా కూడా బెయిల్‌ ఇచ్చింది. కాగా, మహారాష్ట్రలో ష్యూరిటీకి డబ్బును, శాలరీ సర్టిఫికెట్‌ను అంగీకరించరు. ఈ నేపథ్యంలో వరవరరావు కుటుంబసభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌పై విడుదలకు ఆస్తి ధ్రువీకరణ పత్రం నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది. కాగా, బెయిల్‌ నిబంధనలను పూర్తిచేయడానికి వీలుగా నానావతి ఆస్పత్రిలో ఉన్న విప్లవకవి వరవరరావును కలుసుకునేందుకకు ఆయన న్యాయవాది ఆర్‌. సత్యనారాయణకు బాంబే హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. 

Updated Date - 2021-02-26T08:16:19+05:30 IST