ప్రకాశం: జిల్లాలో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిట్లు పోలీసులు తెలిపారు. లింగసముద్రంలో జరిగిన నక్కా ప్రశాంతి (16) అనే యువతి అనుమానాస్పద మృతి హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ప్రశాంతి తల్లి మాధవితో సుంకర శ్రీకాంత్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. శ్రీకాంత్, మాధవిల అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ప్రశాంతిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రశాంతి హత్యకు శ్రీకాంత్ పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.