తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టిన క్రికెటర్‌.. అంగరంగ వైభవంగా దీపక్‌ చాహర్‌ పెళ్లి

ABN , First Publish Date - 2022-06-02T22:17:41+05:30 IST

టీమిండియా క్రికెటర్‌ దీపక్ చాహర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో తన స్నేహితురాలు

తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టిన క్రికెటర్‌.. అంగరంగ వైభవంగా దీపక్‌ చాహర్‌ పెళ్లి

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ దీపక్ చాహర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో తన స్నేహితురాలు జయ భరద్వాజ్‌ను చాహర్‌ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికొడుకుగా మారిన దీపక్ చాహర్.. బ్యాండు మేళంతో, గుర్రంపై కూర్చొని ఊరేగింపుగా హోటల్‌కు చేరుకున్నాడు. క్రీమ్ కలర్ షేర్వానీ, రాజస్థానీ సఫా ధరించి దీపక్ సరికొత్త లుక్‌లో కనిపించాడు.


ఈ వివాహానికి పలువురు రాజకీయ, ప్రముఖులు హాజరై.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపులో బ్యాండ్ వాద్యాల చప్పుళ్లకు దీపక్ డ్యాన్స్ చేశాడు. బాణాసంచా కాలుస్తూ అతిథులు కూడా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత వేడుక అనంతరం దీపక్ నేరుగా వేదిక వద్దకు చేరుకున్నాడు. కాసేపటి తర్వాత జయ కూడా వేదికపైకి చేరుకుంది. అతిథుల ముందు ఇద్దరూ కలిసి ఉన్నారు. పూలమాల వేయగానే చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత ఇద్దరూ ఏడు అడుగులు వేశారు.


అనంతరం అతిథులు దీపక్‌తో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. అంతకుముందు నిర్వహించిన హల్దీ వేడుకలో దీపక్‌ చహర్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. హల్దీ వేడుకలో భాగంగా కుటుంబసభ్యులు, మిత్రులు హల్దీ పెట్టేటప్పుడు దీపక్‌ చహర్‌ తీన్‌మార్‌ స్టెప్పులతో అలరించాడు. దీపక్ చాహర్‌ టీమ్ ఇండియా తరపున 7 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డేల్లో 10 వికెట్లు, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. గాయం కారణంగా వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌లో దీపక్‌కి టీమిండియాలో చోటు దక్కలేదు.

Updated Date - 2022-06-02T22:17:41+05:30 IST