దీక్షిత్ కేసు: బాలుడు స్పహలోకి వచ్చేలోపే హత్య

ABN , First Publish Date - 2020-10-23T16:22:13+05:30 IST

వరంగల్: దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.

దీక్షిత్ కేసు: బాలుడు స్పహలోకి వచ్చేలోపే హత్య

వరంగల్: దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు. ఏడాది నుంచి నిందితుడు డింగ్ టాక్ యాప్ వాడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్ చేశాడు. పెట్రోల్ బంక్‌కు వెళ్దామని బాలుడిని మందసాగర్ తీసుకెళ్లాడు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే బాలుడు సాగర్‌తో వెళ్లాడు. ఈ క్రమంలోనే మంచి నీళ్లలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో నిందితుడు తాగించాడు. బాబు స్పృహలోకి వచ్చేలోపే హత్య చేసేశాడు. ఆ తరువాత డింగ్ టాక్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు ఫాలో అవుతున్నారని అనుమానంతో.. బాలుడి తండ్రి రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణాన్ని మంద సాగర్ నడుపుతున్నాడు. 

Updated Date - 2020-10-23T16:22:13+05:30 IST