లక్ష్మీ బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

ABN , First Publish Date - 2021-02-27T05:26:04+05:30 IST

లక్ష్మీ బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

లక్ష్మీ బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

మహదేవపూర్‌ రూరల్‌, ఫిబ్రవరి 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన లక్ష్మీ బ్యారేజీలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి ప్రధానాధా రమైన ప్రాణహిత నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పడుతుండటం, బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని లక్ష్మీ పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తి పోస్తుండటంతో క్రమక్రమంగా నీటి నిల్వ తగ్గుముఖం పట్టిందని  ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం బ్యారేజీలోకి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఎగువన ఉన్న లక్ష్మీ పంప్‌ హౌజ్‌ నుంచి 4,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో లక్ష్మీ బ్యారేజీలో 4.17 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-27T05:26:04+05:30 IST