క్యూ3 వృద్ధి 1.3 శాతం : డీబీఎస్‌

ABN , First Publish Date - 2021-02-24T08:13:38+05:30 IST

దేశంలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సానుకూలంగా మారి 1.3 శాతం నమోదు కావచ్చని డీబీఎస్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. వ్యవసాయ రంగం వృద్ధి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని...

క్యూ3 వృద్ధి 1.3 శాతం : డీబీఎస్‌

న్యూఢిల్లీ: దేశంలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సానుకూలంగా మారి 1.3 శాతం నమోదు కావచ్చని డీబీఎస్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. వ్యవసాయ రంగం వృద్ధి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీనికి తోడు తయారీ, ఆర్థిక, ప్రభుత్వ పాలనా విభాగాలు కూడా వృద్ధికి దోహదపడవచ్చని పేర్కొంది.

మరో వైపు అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలను వచ్చే శుక్రవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా పూర్తి ఏడాది కాలానికి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 6.8 శాతానికి పరిమితం కావచ్చని డీబీఎస్‌ అంచనా వేసింది. కరోనా దెబ్బకు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మైనస్‌ 23.9 శాతం క్షీణత చవిచూసిన భారత్‌ రెండో త్రైమాసికంలో ఆ క్షీణతను మైనస్‌ 7.5 శాతానికి తగ్గించుకోగలిగింది.

Updated Date - 2021-02-24T08:13:38+05:30 IST