athlete fails dope test : డోప్ టెస్టులో మరో అథ్లెట్ విఫలం.. కామన్‌వెల్త్ గేమ్స్‌‌ ముందు ఎదురుదెబ్బ..

ABN , First Publish Date - 2022-07-25T20:24:16+05:30 IST

బర్మింగ్‌హామ్‌ వేదికగా రోజుల వ్యవధిలోనే ఆరంభమవనున్న ‘కామన్‌వెల్త్ గేమ్స్’కు (Commonwealth Games) ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

athlete fails dope test : డోప్ టెస్టులో మరో అథ్లెట్ విఫలం.. కామన్‌వెల్త్ గేమ్స్‌‌ ముందు ఎదురుదెబ్బ..

న్యూఢిల్లీ : బర్మింగ్‌హామ్‌ వేదికగా రోజుల వ్యవధిలోనే ఆరంభమవనున్న ‘కామన్‌వెల్త్ గేమ్స్’కు (Commonwealth Games) ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత 4*100 మీటర్ల ఉమెన్స్ రిలే స్క్వాడ్‌‌లో సభ్యురాలైన ఓ అథ్లెట్(athlete) డోపింగ్ టెస్టు(dope test)లో విఫలమైంది. నిషేధిత పదార్థాలు తీసుకున్నట్టు నాడా(నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ) (NADA) నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(AFI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. ‘ఔను నిజమే.. ఒక అథ్లెట్ డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. సంబంధిత ప్రక్రియను అనురించాల్సి ఉంటుంది’ అని సదురు అధికారి చెప్పారు. పట్టుబడిన స్ర్పింటర్ రెండేళ్ల క్రితం నేషనల్ ఛాంపియన్‌ అని చెప్పారు. ఇటివలే ఆమె స్క్వాడ్‌లో చేరిందని, ఆగస్ట్ 8న జరగనున్న ఈవెంట్‌లో పాల్గొనాల్సిన సమయంలో ఈ పరిణామం జరిగిందన్నారు. డ్రగ్ టెస్టులో విఫలమవ్వడంతో ఇండియన్ ఉమెన్స్ 4*100 రిలే స్వాడ్ నిస్సహాయ స్థితిలో పడిందన్నారు. గేమ్స్ ప్రారంభమవ్వడానికి కేవలం 4 రోజుల ముందే ఈ పరిణామం జరిగిందన్నారు. ఆరుగురు సభ్యుల రిలే బృందంలో ఇద్దరు డోప్ టెస్టులో పట్టుబడ్డారని అధికారి గుర్తుచేశారు. దీంతో ఇండియన్ జట్టుకి ఇంజ్యూరీ(గాయం) కవర్ ఉండదని చెప్పారు. అయితే కామన్‌వెల్త్ గేమ్స్‌ స్వాడ్‌లో ఉన్న 100 మీటర్స్ హర్డలర్ జ్యోతి యర్రాజీ, లాంగ్ జంపర్ అన్సీ సోజన్ ఇద్దరూ బ్యాకప్ రన్నర్స్‌గా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. 


కాగా ఇప్పటికే స్ర్పింటర్ ధనలక్ష్మీ(ఈమె కూడా 4*100 మీటర్ రిలే టీం సభ్యురాలు), ట్రిపుల్-జంప్ జాతీయస్థాయి రికార్డ్ హోల్డర్ ఐశ్వర్య బాబు డ్రగ్ టెస్టులో విఫలమైన విషయం తెలిసిందే. వారం గడవక ముందే మరొకరు విఫలమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బగానే పరిగణించాలి. 2011 డోపింగ్ స్కాండల్ తర్వాత భారత్‌లో ఈ ఏడాదే ఎక్కువమంది డోప్ టెస్టులో పట్టుబడ్డట్టమైంది. 2011లో ఆరుగురు డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యారు. వీరిలో 2010 కామన్‌వెల్త్ గేమ్స్ అథ్లెట్లు ఉండడం గమనార్హం. కాగా వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ(వాడా) 2021లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. డోపింగ్ కేసుల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అన్నీ గేమ్స్ క్రీడాకారుల్లో 152 మంది భారత్‌లో డోపింగ్ టెస్టుల్లో విఫలమవ్వగా... రష్యా(167), ఇటలీ(157) ఇండియా కంటే ముందు స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - 2022-07-25T20:24:16+05:30 IST