బెక్‌హామ్‌ కుమారుడి నిశ్చితార్థం

ABN , First Publish Date - 2020-07-12T09:08:29+05:30 IST

ప్రపంచ సాకర్‌ మాజీ సూపర్‌స్టార్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ కుమారుడు బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు...

బెక్‌హామ్‌ కుమారుడి నిశ్చితార్థం

లండన్‌: ప్రపంచ సాకర్‌ మాజీ సూపర్‌స్టార్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ కుమారుడు బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. అమెరికాకు చెందిన నటి నికోలా పెల్జ్‌తో తనకు నిశ్చితార్థం జరిగినట్టు 21 ఏళ్ల బ్రూక్లిన్‌ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. నిశ్చితార్థం సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు. డేవిడ్‌ బెక్‌హామ్‌, విక్టోరియా నలుగురు సంతానంలో పెద్దవాడైన బ్రూక్లిన్‌ వృత్తిరీత్యా మోడల్‌, ఫొటోగ్రాఫర్‌.

Updated Date - 2020-07-12T09:08:29+05:30 IST