దళితబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు: కొప్పుల ఈశ్వర్

ABN , First Publish Date - 2021-08-26T21:11:35+05:30 IST

దళితబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

దళితబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు: కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: దళితబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నినెలల్లో అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. హుజురాబాద్‌లో దళిత బంధు పథకంలో 21 వేల కుటుంబాలకు లబ్ది కలుగుతుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దళిత బంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ పథకానికి రూ.1500 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ. 500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకూ మొత్తం రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. 

Updated Date - 2021-08-26T21:11:35+05:30 IST