హైదరాబాద్: మార్చి 31లోగా అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై బీజేపీకి ప్రేముంటే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలన్నారు. దళితులపై బీజేపీ వివక్ష చూపుతోందని, ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి