21 వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం టెట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2022-08-06T18:28:01+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్‌) శనివారం ప్రారంభంకానున్నాయి. ఈనెల 21 వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా పరీక్షలు

21 వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం టెట్‌ పరీక్షలు

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్‌) శనివారం ప్రారంభంకానున్నాయి. ఈనెల 21 వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,25,789మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, ఒడిసా రాష్ర్టాలతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం పేపర్‌-2ఎ(గణితం, సైన్స్‌)తో పరీక్షలు ప్రారంభమవుతాయి. 12వ తేదీ వరకు సబ్జెక్టులకు, 13 నుంచి 21 వరకు ఎస్జీటీ అర్హతకు పరీక్షలు జరుగుతాయి. కాగా రోజుల వారీగా ఎంత మంది పరీక్షలు రాస్తున్నారనే వివరాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించలేదు. 2018 తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నందున టెట్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవారికి టెట్‌ తప్పనిసరి చేయడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏర్పాట్ల విషయంలో పాఠశాల విద్యా శాఖ విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. వేలాది మంది పక్క రాష్ర్టాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో పరీక్షాకేంద్రాల్లో ఖాళీలున్నాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించిన రోజున కూడా ఆన్‌లైన్‌లో ఒక్క కేంద్రం కూడా చూపించలేదు. ఇది సాంకేతిక సమస్య కావచ్చని భావించగా, దానిని గుర్తించడంలోనూ శాఖ విఫలమైంది. 

Updated Date - 2022-08-06T18:28:01+05:30 IST