NTR అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు : దాడిశెట్టి రాజా
ABN , First Publish Date - 2022-09-26T20:21:39+05:30 IST
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై ఏపీలో పెను దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే.
Kakinada : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై ఏపీలో పెను దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఏపీ సీఎం జగనే (CM Jagan).. తనకూ ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందంటూ.. ఆచి తూచి మాట్లాడుతుంటే మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetty Raja) మాత్రం నోటికి పని చెప్పారు. సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ అంత చేత కాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని విమర్శించారు. సీఎంగా ఉండి కూడా రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకుని కూడా నాదెండ్ల (Nadendla).. చంద్రబాబు (Chandrababu)తో రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న నేత ఎన్టీఆర్ అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)కి ఎన్టీఆర్కు అసలు పోలికే లేదని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.