రేస్ మధ్యలో వడగళ్ల వాన.. సైక్లిస్టులకు గాయాలు!

ABN , First Publish Date - 2020-08-15T04:44:03+05:30 IST

సైకిల్ రేస్ జరుగుతుండగా వడగళ్ల వాన కురిసింది. దీంతో సైక్లిస్టులు గాయపడ్డారు.

రేస్ మధ్యలో వడగళ్ల వాన.. సైక్లిస్టులకు గాయాలు!

పారిస్: సైకిల్ రేస్ జరుగుతుండగా వడగళ్ల వాన కురిసింది. దీంతో సైక్లిస్టులు గాయపడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగిన క్రిటేరియమ్ డూ డాఫీన్ రేసులో ఈ సంఘటన చోటుచేసుకుంది. రేసులో పాల్గొన్న టిమ్ డిక్లెర్క్ తనకు తగిలిన గాయాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతని వీపు మొత్తం బాగా దెబ్బలు తగిలి రక్తం గడ్డకట్టింది. ఈ ఫొటోలను షేర్ చేసిన టిమ్.. ‘రేసులో కాళ్లకు వచ్చే నొప్పులు చాలవన్నట్లు ఇవి కూడా’ అంటూ పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన క్రీడాభిమానులు.. ‘మీరు మామూలోళ్లు కాదు’ అంటూ అథ్లెట్లను మెచ్చుకున్నారు.

Updated Date - 2020-08-15T04:44:03+05:30 IST