ప్రభుత్వ రుణం పేరుతో గాలం.. లక్షలు కొట్టేశారు!

ABN , First Publish Date - 2021-03-06T12:23:08+05:30 IST

ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు

ప్రభుత్వ రుణం పేరుతో గాలం.. లక్షలు కొట్టేశారు!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ. 16 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళ ఫోన్‌ నెంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. నమ్మిన ఆమె అతడు చెప్పిన ఖాతాలో నగదు జమ చేసింది. జీఎ‌స్‌టీ, ట్యాక్స్‌ల పేరుతో ఎనిమిది సార్లు ఆమె నుంచి రూ. 16 లక్షలు వివిధ ఖాతాల్లో జమచేయించుకున్నాడు. అనంతరం ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-06T12:23:08+05:30 IST