కావలసినవి: కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్, ధనియాలు అర టీస్పూన్, నువ్వులు - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్, మినప్పప్పు - అర స్పూన్, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్.
తయారీ విధానం: ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. నువ్వుపప్పు దోరగా వేగించాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.
కరివేపాకులో...
క్యాలరీలు - 108
కార్బోహైడ్రేట్లు - 18
ఫైబర్ - 6.4 గ్రా
ప్రొటీన్ - 6 గ్రా
ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, సి-విటమిన్, కాపర్, మెగ్నీషియంలు మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. కంటిచూపును కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
మామిడికాయ పచ్చడి
కొత్తిమీర చట్నీ
క్యారెట్ పచ్చడి
పుదీనా పెరుగు చట్నీ
కొత్తిమీర చట్నీ
ఖట్టా మీఠా చట్నీ
నీటి ఆవకాయ పచ్చడి
మామిడి తరుము పచ్చడి
అరటికాయ పెరుగు పచ్చడి
ముల్లంగి తొక్కు
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.