‘రెరా’ నిబంధనలు పాటించని రియల్టర్లపై క్రిమినల్ కేసులు: సీఎస్

ABN , First Publish Date - 2022-02-19T02:16:17+05:30 IST

తెలంగాణలో రియల్ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా) నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెచ్చరించారు.

‘రెరా’ నిబంధనలు పాటించని రియల్టర్లపై క్రిమినల్ కేసులు: సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో రియల్ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా) నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం క్రెడాయ్, ట్రడాయ్, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ తదతర సంస్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ లో వ్యక్తిగత షేర్, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి ప్రీలాంచ్ వంటి వాటిలో పలువురు రెరా నిబంధనలు పాటించడం లేదన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రెరా నిబంధనలు పాటించని వ్యక్తులు, కంపెనీలు, డెవలర్స్ తాము చేసే వ్యాపారంలో తప్పని సరిగా నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటుచేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, క్రెడాయ్ సహకారంతో మున్సిపల్, రిజిస్ర్టేషన్, ఐపిఆర్ డిపార్ట్ మెంట్ పెద్దయెత్తున ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు సీఎస్ తెలిపారు. 


రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కొనుగోళ్లకు సంబంధించి రెరా నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నవిషయాల పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దయెత్తున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా మోసాలకు పాల్పడే నిర్మాణ దారుల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే రియల్టర్లపై కఠిన చర్యలకు తాము కూడా సహకరిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. టౌన్ ప్లానిం్, రిజిస్ర్టేషన్, డిపార్టమెంట్లతో ఒక ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తామని క్రెడాయ్ ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రిజిస్ర్టేషన్ శాఖ అడిషనల్ డీజీ శేషాద్రి, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసి సీసీపి దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ ప్లానింగ్ బాలక`ష్ణ, డిటీసీపి విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-19T02:16:17+05:30 IST