జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేయాలి: సీఎస్

ABN , First Publish Date - 2022-02-27T21:19:01+05:30 IST

తెలంగాణలో టీఎస్ బిపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు,పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేయాలి: సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో టీఎస్ బిపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు,పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జనన, మరణాలను వందశాతం నమోదు చేసేలా అధికారులు చర్యలుతీసుకోవాలన్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసి కమిషనర్, సిడీఎంఏ, హెచ్ఎంఎఫ్ఎం తగిన విధంగా స్పందించి కేవలం హాస్పటిల్స్ లోనే కాకుండా స్మశాన వాటికలు,క్రిమేషన్ గ్రౌండ్ లలోనూ తగిన సమాచారంతో నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఆన్ లైన్ నోటిఫికేషన్లను జారీ చేయాలన్నారు. 


ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసి, ఇతర యుఎల్బిలు, గ్రామపంచాయితీలు జనన మరణాల నమోదుకు సమన్వయంతో పని చేయాలన్నారు. వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ల పై కూడా సీఎస్ రివ్యుచేశారు. ముఖ్యమంత్రి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన టీఎస్ బిపాస్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు జరుగుతోందన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-02-27T21:19:01+05:30 IST