ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సీఎస్

ABN , First Publish Date - 2021-08-07T21:38:01+05:30 IST

రాష్ట్రంలోని ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షించారు.

ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన  సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్ఐడిఎఫ్ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షించారు. మంజూరు అయిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన  ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వైకె రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, నాబార్డ్ రాష్ట్రానికి మంజూరుచేసిన పనులు, విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ నాబార్డ్ విడుదల చేసిన మొత్తం నిధులను అన్ని విభాగాలు ఉత్పాదకంగా ఖర్చు చేయాలని, ప్రాజెక్టుల పూర్తి నివేదికలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. 


నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ మొదలైన శాఖలు చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.  రాష్ట్రంలో ఇంటెన్సివ్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి సులభంగా ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాలను అన్వేషించాలని వ్యవసాయశాఖ కార్యదర్శిని  కోరారు.ఈ సమావేశంలో టిఆర్ అండ్ బి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు,  ఆర్ధిక శాఖ  ప్రత్యేక  కార్యదర్శి రోనాల్డ్ రోస్,  మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ  ప్రత్యేక  కార్యదర్శిదివ్య, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ సయ్యద్ ఓమర్ జలీల్,  టిఎస్ఈడబ్ల్యుఐడిసి, ఎండి, పార్థసారధి, నీటి పారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-07T21:38:01+05:30 IST