హైదరాబాద్: నగరంలోని నాలా విస్తరణ పనులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) పై బీఆర్కేఆర్ భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల కోసం తీసుకోవాలసిన చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ షర్మాన్, ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.