న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరడు కట్టిన దొంగకు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు మధ్య సోమవారం అర్ద రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. ఢిల్లీలోని చాహ్వ్లా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ క్రిమినల్ అబ్దుల్ వహీద్ కు బుల్లెట్ గాయమైంది. కరడుకట్టిన దొంగ అయిన అబ్దుల్ వహీద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇతను గతంలో 24 దొంగతనాలు,స్నాచింగులు, ఐదు నేరాలకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ యాదవ్ చెప్పారు.జులై 8వతేదీన ఢిల్లీలో వహీద్ చేసిన స్నాచింగ్ వీడియో తమకు దొరికిందని డీసీపీ చెప్పారు. కరడుకట్టిన దొంగ ఎదురుకాల్పుల్లో గాయపడి దొరకడంతో పలు దొంగతనాల కేసులు బయటపడ్డాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.