ఈ దొంగ మామూలోడు కాదు...!

ABN , First Publish Date - 2021-10-29T00:32:46+05:30 IST

తెనాలి ఐతా నగర్‌లో ఓ పాత నేరస్థుడు హల్ చల్ చేశాడు. దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లగా అతి తెలివి చూపించాడు. ఇంట్లో నుంచి పరారయ్యాడు...

ఈ దొంగ మామూలోడు కాదు...!

గుంటూరు: తెనాలి ఐతా నగర్‌లో ఓ పాత నేరస్థుడు హల్ చల్ చేశాడు. దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లగా అతి తెలివి చూపించాడు. ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఐతా నగర్ లోని చెరువులో దూకాడు. తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 


నిందితుడు భరత్ పై గతంలో చాలా కేసులున్నాయి. ఓసారి గంజాయి తాగి హల్ చల్ చేశాడు. ఆ సమయంలోనూ పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా కాల్వలో దూకి ఎస్కేప్ అయ్యాడు. పోలీసులకు సవాల్ విసిరాడు. 



Updated Date - 2021-10-29T00:32:46+05:30 IST