సీపీఎస్ ఉద్యోగులు లక్ష లేఖలతో ఉద్యమం..!

ABN , First Publish Date - 2022-03-03T17:07:32+05:30 IST

సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం లక్ష లేఖలతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించనుంది.

సీపీఎస్ ఉద్యోగులు లక్ష లేఖలతో ఉద్యమం..!

విజయవాడ: సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం లక్ష లేఖలతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించనుంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్‌కు లేఖలు రాయనున్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరుణంలో ఏపీలో కూడా జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేఖలతో తమ ఆవేదనను తెలియజేయాలని సీపీఎస్ ఉద్యోగులు నిర్ణయించారు.


ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ లేఖలో ప్రస్తావిస్తూ సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందిగా కోరనున్నారు. పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీలే కాకుండా సీపీఎస్ రద్దుపై ఎన్నికల మేనిఫెస్టులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేయనున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని టక్కర్ కమిటీ నివేదికలో స్పష్టం చేసిన విషయాన్ని ఆ లేఖ ద్వారా గుర్తు చేయనున్నారు.

Updated Date - 2022-03-03T17:07:32+05:30 IST