హైదరాబాద్: బీజేపీపై కేసీఆర్ మెతక వైఖరిని అవలంభిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. బీజేపీపై కేసీఆర్ బహిరంగంగా పోరాటం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో వామపక్షాలు బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీపై పోరులో అందరినీ కలుపుకుపోతామని తమ్మినేని తెలిపారు.
ఇవి కూడా చదవండి