అన్ని శాఖల్లోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: చాడ

ABN , First Publish Date - 2020-09-21T07:55:28+05:30 IST

విద్యుత్‌ శాఖలో క్రమబద్ధీకరణ చేసినట్టుగా అన్ని శాఖల్లోని దినసరి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని

అన్ని శాఖల్లోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: చాడ

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలో క్రమబద్ధీకరణ చేసినట్టుగా అన్ని శాఖల్లోని దినసరి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వ్యవసాయ బిల్లులను అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకోవడం అవమానకరమని.. ఇది రాజ్యసభకు చీకటి రోజని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నోళ్లు నొక్కి మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదింపజేసుకోవడం అన్యాయమన్నారు. సెప్టెంబరు 25న దేశవ్యాప్తంగా జరిగే రైతుల నిరసనలను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-09-21T07:55:28+05:30 IST