సిట్‌కు ఉన్న పరిధి చాలా పరిమితం: నారాయణ

ABN , First Publish Date - 2020-02-16T16:16:06+05:30 IST

విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని సీపీఐ నేత నారాయణ చెప్పుకొచ్చారు.

సిట్‌కు ఉన్న పరిధి చాలా పరిమితం: నారాయణ

అమరావతి : విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని సీపీఐ నేత నారాయణ చెప్పుకొచ్చారు. ఇవాళ ఈ సిట్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. భూకుంభకోణంలో అంతా అధికార, విపక్ష ముఖ్యనేతలే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వేసిన సిట్ ఎంతో... వైసీపీ వేసిన సిట్‌ అంతేనని ఆయన తెలిపారు. సిట్‌కు ఉన్న పరిధి చాలా పరిమితమని.. భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని నారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-02-16T16:16:06+05:30 IST