అమరావతి : చింతామణి నాటకాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు దీనిపై సీపీఐ నారాయణ తనదైన శైలిలో స్పందించారు. చింతామణి నాటకాన్ని నిషేధించటాన్ని కళామతల్లిపై దాడిగా ఆయన అభివర్ణిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. చేతనైతే.. బ్రోతల్ హౌస్ బిగ్‌బాస్‌ను నిషేధించాలన్నారు. 1923 నుంచి రంగస్థల నాటకం చింతామణిని నిషేధించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. బూతుల మంత్రులను నిషేదించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.