సీమకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-12T15:24:02+05:30 IST

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ఖరీఫ్ లోనైనా రాయలసీమకు నీళ్ళు వదిలి రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

సీమకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోండి: రామకృష్ణ

అమరావతి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ఖరీఫ్ లోనైనా రాయలసీమకు నీళ్ళు వదిలి రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులకు చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు వదిలే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 5 రోజుల నుండి 855 అడుగుల నీటి మట్టం కొనసాగుతున్నా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వదలక పోవడం సరికాదన్నారు. అవసరం లేకున్నా శ్రీశైలంలోని నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుని నాగార్జునసాగర్‌కు వదిలేస్తోందని విమర్శించారు. గత ఏడాది కూడా వరద నీటిని వాడుకోకుండా సముద్రంపాలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సీమ ప్రాజెక్టులకు నీళ్లు వదిలి లక్షలాది ఎకరాల ఆయకట్టును ఆదుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-12T15:24:02+05:30 IST