ఇప్పుడైనా ఇరు పార్టీల ఎంపీలు రైతుల పక్షాన నిలబడాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-20T13:41:16+05:30 IST

కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి కనీసం ఇప్పుడైనా వైసీపీ, టీడీపీ ఎంపీలు రైతుల పక్షాన నిలబడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇప్పుడైనా ఇరు పార్టీల ఎంపీలు రైతుల పక్షాన నిలబడాలి: రామకృష్ణ

అమరావతి: కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి కనీసం ఇప్పుడైనా వైసీపీ, టీడీపీ ఎంపీలు రైతుల పక్షాన నిలబడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే బిల్లుల పట్ల దేశవ్యాప్తంగా 155 రైతు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ఎన్డీఏ మిత్ర పక్షమైన అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఆ పార్టీ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిందని ఆయన చెప్పారు. పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్డెక్కారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర వ్యవసాయ బిల్లును తీవ్రంగా తప్పుబట్టి, టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించాలంటూ ఆదేశించారని తెలిపారు. కేంద్రం వ్యవసాయ బిల్లులను కనీసం రాజ్యసభలోనైనా వైసీపీ, టీడీపీ ఎంపీలు వ్యతిరేకించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-20T13:41:16+05:30 IST