ఉమ్మడి ఆస్తుల వివాదాలు సత్వరమే పరిష్కరించాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-05T14:02:31+05:30 IST

ఉమ్మడి ఆస్తుల వివాదాలు సత్వరమే పరిష్కరించాలి: రామకృష్ణ

ఉమ్మడి ఆస్తుల వివాదాలు సత్వరమే పరిష్కరించాలి: రామకృష్ణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ఆస్తుల వివాదాల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. షెడ్యూల్ 9లో ఉన్న వివాదాలు పరిష్కరించబడలేదన్నారు. పలు విద్యా సంస్థలు, మ్యూజియాలు ఆంధ్ర ప్రాంతానికి చెందాల్సి ఉందని పేర్కొన్నారు. షెడ్యూల్ 10 ప్రకారం ఉమ్మడి ఆస్తుల విలువ రు.73 వేల కోట్ల నుండి 1 లక్షా 86 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. 


ఉమ్మడి ఆస్తుల్లో 58 శాతం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉందని... నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 70% హక్కులు ఏపీకి ఉండాలని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కూడా ఆంధ్ర, తెలంగాణల మధ్య వివాదం కొనసాగుతోందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన 26 బీసీ కులాలను రిజర్వేషన్ తీసేసి తెలంగాణలో ఓసి కులాలుగా పరిగణించడం అన్యాయమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 





Updated Date - 2020-07-05T14:02:31+05:30 IST