Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్యాంక్ బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ దెబ్బతినకుండా పోలీసులు ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టాన్ని వాడుతున్నామన్నారు. ట్యాంక్ బండ్‌పై ఈ సారి క్రేన్ల సంఖ్య తగ్గిస్తున్నామని తెలిపారు. కేవలం పెద్ద విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్‌పైకి అనుమతిస్తామని అంజన్ కుమార్ తెలిపారు.

Advertisement
Advertisement