ట్రోఫీలు అమ్మి పీఎం కేర్స్‌కు క్రీడాకారుడి విరాళం

ABN , First Publish Date - 2020-04-08T17:23:58+05:30 IST

గోల్ఫ్ యువ క్రీడాకారుడు తన ట్రోఫీలన్నింటినీ అమ్మి, వచ్చిన రూ.4.3 లక్షల డబ్బును ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలిచిన...

ట్రోఫీలు అమ్మి పీఎం కేర్స్‌కు క్రీడాకారుడి విరాళం

గోల్ఫ్ క్రీడాకారుడి ఆదర్శం...రియల్ హీరో అర్జున్ భాటి

నోయిడా : దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న తరుణంలో గోల్ఫ్ యువ క్రీడాకారుడు తన ట్రోఫీలన్నింటినీ అమ్మి, వచ్చిన రూ.4.3 లక్షల డబ్బును ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని గ్రేటర్ వ్యాలీ స్కూలులో పదోతరగతి చదువుతున్న అర్జున్ భాటి గోల్ఫ్ క్రీడాకారుడు. ప్రపంచ జూనియర్ గోల్ఫ్ పోటీల్లో మూడుసార్లు చాంఫియన్ గా నిలిచి బంగారు పతకాలు సాధించిన అర్దున్ భాటికి 102 ట్రోఫీలు లభించాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో తనకు వచ్చిన ట్రోఫీలను తన బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులకు విక్రయించగా అతనికి రూ.4.3 లక్షల డబ్బు వచ్చింది. ట్రోఫీలు విక్రయించగా వచ్చిన రూ.4.3లక్షలను అర్జున్ భాటీ ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ కు విరాళంగా అందించి పెద్ద మనసు చాటుకున్నారు.


కరోనా కష్టకాలంలో తన వంతు సాయం అందించేందుకే తనకు గత 8ఏళ్లలో వచ్చిన ట్రోఫీలను విక్రయించాలని అర్జున్ భాటి చెప్పారు. తనకు సొంత సంపాదన లేనందున ట్రోఫీలు అమ్మగా వచ్చిన డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందించడం నాకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు.రియల్ హీరో అర్జున్ భాటి ఆదర్శాన్ని అందరూ అభినందించారు.

Updated Date - 2020-04-08T17:23:58+05:30 IST