అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2022-04-13T20:35:50+05:30 IST

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసును కోర్టు కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో హిందువులను

అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

హైదరాబాద్: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి నిజామాబాద్, నిర్మల్‌లో అక్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్‌పై నమోదయిన రెండు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసులు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు వద్దని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దాదాపు 30 మంది సాక్షులను కోర్టు విచారించింది. సుదీర్ఘ వాదనల తర్వాత బుధవారం నాంపల్లి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 


పదేళ్ల క్రితం ఎంఐఎం సభలో అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.’’ అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఈ ప్రసంగంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అక్బర్ 40 రోజులు జైల్లో ఉన్నారు. 

Updated Date - 2022-04-13T20:35:50+05:30 IST