Abn logo
Apr 9 2020 @ 19:28PM

తెలంగాణలో 101 కరోనా హాట్‌స్పాట్లను గుర్తించాం: మంత్రి ఈటల

హైదరాబాద్: ప్రజలంతా లాక్‌డౌన్‌కు బాగా సహకరిస్తున్నారని, లాక్‌డౌన్‌ లేకపోతే వందల సంఖ్యలో కేసులు వచ్చేవి అని ఈటల అన్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలని సీఎం చెప్పారని ఈటల తెలిపారు. రాష్ట్రంలో 101 కరోనా హాట్‌స్పాట్లను గుర్తించామని, హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేస్తామని ఈటల పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు బంద్‌, కేవలం కరోనా పేషెంట్లే ఉంటారని ఈటల తెలిపారు. రాష్ట్రంలో 1500 మంది తలసేమియా బాధితులు ఉన్నారని, రక్తదాతలు 108, 104కి సమాచారం ఇవ్వాలని ఈటల సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకుంటున్నామని, రేషన్‌ కార్డు సకాలంలో రాకపోయినా బియ్యం ఇస్తున్నామని ఈటల చెప్పారు. వైద్య సహాయం కోసం ఫోన్‌లోనే వైద్యుడిని సంప్రదించే ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల వెల్లడించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, వెయ్యి వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చామని మంత్రి ఈటల అన్నారు.

Advertisement
Advertisement
Advertisement