అనంతపురం: కొవిడ్ అనుమానిత లక్షణాలతో గుంతకల్లు మండలం పాత కొత్తచెరువుకు చెందిన వాలంటీర్ జగదీష్ మృతి చెందాడు. జ్వరం, దగ్గు వస్తుండడంతో ఈ నెల 22న కొవిడ్ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యం కోసం అనంతపురంకు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు అనంతపురం నుంచి కర్నూలు కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.